Virat Kohli Records: కోహ్లీ దెబ్బకు పాంటింగ్ రికార్డ్ బద్దలు.. లిస్టులో అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

|

Sep 28, 2023 | 5:36 AM

India vs Australia 3rd ODI Records: రోహిత్ శర్మతో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లి 61 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 56 పరుగులు చేసి గ్లెన్ మాక్స్ వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ అర్ధశతకంతో వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఓ ప్రత్యేక రికార్డును లిఖించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే, సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. ఈక్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సాధించిన ఆ రికార్డుల గురించి ఇప్పుడు చూద్దాం..

1 / 8
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించి మరో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడో నంబర్‌లో వచ్చిన కింగ్ కోహ్లి తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

2 / 8
రోహిత్ శర్మతో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కోహ్లి 61 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 56 పరుగులు చేసి గ్లెన్ మాక్స్ వెల్‌కు వికెట్ అప్పగించాడు.

3 / 8
ఈ 56 పరుగులతో వన్డే క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. టాప్-3లో కనిపించిన 2వ భారతీయుడిగా కూడా నిలిచాడు.

4 / 8
అంతకు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 3వ స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 365 ఇన్నింగ్స్‌లలో 112 సార్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.

5 / 8
ఇప్పుడు కింగ్ కోహ్లి కేవలం 269 ఇన్నింగ్స్‌ల్లోనే 113 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 50కిపైగా స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రికీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.

6 / 8
ప్రస్తుతం ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్‌గా పేరుగాంచిన లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్‌లలో 145 సార్లు 50+ స్కోర్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

7 / 8
రెండో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 380 ఇన్నింగ్స్‌ల్లో 118 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.

8 / 8
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ రెండో స్థానానికి వెళ్లాలంటే కేవలం ఆరు 50+ స్కోర్లు మాత్రమే కావాలి. తద్వారా రానున్న వన్డే ప్రపంచకప్‌లో కింగ్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి మరో రికార్డును ఆశించవచ్చు.