
India vs Netherlands, 45th Match: ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో భారత్ ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది.

అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో అద్భుతంగా ఆడారు. అయితే, ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్ 2023 ఎడిషన్‌లో రోహిత్ శర్మ 500 పరుగులు పూర్తి చేశాడు.

ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500 కంటే ఎక్కువ పరుగులు నమోదు చేయడం ఇదే తొలిసారి.

కాగా, కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 500 పరుగులు పూర్తి చేశాడు.

సచిన్ టెండూల్కర్ తర్వాత ఒకే ప్రపంచకప్‌లో పలు సందర్భాల్లో 500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు.