IND vs NZ: టీమిండియాను ఓడించడం మీవల్ల కాదు.. గెలవాలంటే అదొక్కటే మార్గం..!

Updated on: Nov 08, 2026 | 10:43 AM

India vs New Zealand ODI: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 11 విజయాలతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆధిపత్యాన్ని చూసి రిక్కీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కివీస్ గెలవాలంటే టాస్ గెలవడం తప్ప మరో మార్గం లేదని, స్వింగ్ వికెట్లపై భారత్ బౌలింగ్ అత్యద్భుతంగా ఉందని పాంటింగ్ విశ్లేషించారు.

1 / 5
India vs New Zealand ODI: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్‌పై పది కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచంలోనే మొట్టమొదటి జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు ఉప్పొంగిపోయారు. ఇటీవల వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో భారత్ సాధించిన థ్రిల్లింగ్ విజయం ఈ సంవత్సరంలో కివీస్‌పై టీమిండియాకు పదకొండవ విజయాన్ని అందించింది.

2 / 5
ఈ విజయం కేవలం ఒక మ్యాచ్‌ను గెలవడం మాత్రమే కాదు, కొన్ని అద్భుతమైన రికార్డులను తిరగరాసింది. 2005లో ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ సారథ్యంలోని జట్టు న్యూజిలాండ్‌పై సాధించిన పది విజయాల రికార్డును భారత జట్టు తుడిచిపెట్టేసింది. అంతేకాకుండా, 2008లో ఇంగ్లాండ్ నమోదు చేసిన తొమ్మిది విజయాల రికార్డును కూడా టీమిండియా సునాయాసంగా అధిగమించింది. మొత్తం 16 మ్యాచ్‌లలో 11 విజయాలు సాధించడం భారత్ తిరుగులేని ఆధిపత్యానికి స్పష్టమైన నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్‌పై భారత్ పక్కా వ్యూహంతో అద్భుతమైన ఆధిపత్యాన్ని చెలాయించింది.

3 / 5
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలు అలాగే రెండు టెస్టుల సిరీస్‌లలో తలపడుతోంది. ముందుగా జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయాలు నమోదు చేసింది. మరో ఒక్క మ్యాచ్ గెలిస్తే టీమిండియాకు వన్డే సిరీస్ కూడా వశమవుతుంది. దీంతో న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా దుమ్మురేపుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్ టీమిండియాపై ఒక్క సిరీస్ అయినా నెగ్గుతుందా అనేది అనుమానంగా మారింది.

4 / 5
ఈ అద్భుతమైన ప్రదర్శనపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ సైతం తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌కు అనుకూలించే పిచ్‌లపై కూడా టీమిండియా ఇంతలా చెలరేగుతుందని అసలు ఊహించలేదని ఆయన అన్నారు. టీ20లలో సరే, వన్డేలలో టీమిండియా బౌలింగ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని పాంటింగ్ వ్యాఖ్యానించారు. స్వింగ్ వికెట్‌పై న్యూజిలాండ్ బౌలర్ల కంటే టీమిండియా బౌలర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఒకవేళ ఈ వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఒకే ఒక మార్గం టాస్ గెలవడమే కీలకం అని పాంటింగ్ నొక్కి చెప్పారు.

5 / 5
టాస్ గెలిచి తొలిత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే, అప్పుడు టీమిండియా బౌలింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుందన్నారు. అంతేకాకుండా, న్యూజిలాండ్‌కు టార్గెట్‌ను నిర్దేశించే అవకాశం ఉండదన్నారు. టీ20లలో వరుసగా టీమిండియాపై న్యూజిలాండ్ ఓటమికి టాస్సే కీలకమని పాంటింగ్ గుర్తు చేశారు. ఇప్పుడు వన్డేలలోనూ అదే జరుగుతోందని, న్యూజిలాండ్ ఒకవేళ టాస్ గెలిస్తే అప్పుడు ఛేజింగ్‌కు మొగ్గు చూపడం ఖాయం అని ఆయన విశ్లేషించారు. అలాంటి సమయంలో న్యూజిలాండ్‌కు గెలుపు ఛాన్సులు ఉండే అవకాశం ఉందని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే, న్యూజిలాండ్ బౌలింగ్‌తో పోలిస్తే టీమిండియా బౌలర్లు కూడా ఎక్కడా తగ్గడం లేదని, పిచ్ కండిషన్స్‌ని బట్టి టాస్ ఏమైనా న్యూజిలాండ్ రాతను మారుస్తుందేమో చూడాలి అని రిక్కీ పాంటింగ్ ముగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us