T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్.. ఒకేరోజు రెండు రికార్డులు.. ఆ బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా?

|

Nov 07, 2021 | 3:40 PM

Biggest Six: టీ20 ప్రపంచ కప్ 2021లో ఈసారి చాలా మంది దిగ్గజాలు ఎక్కువ పరుగులు సాధించలేకపోయాడరు. కానీ, కొంతమంది కొత్త ఆటగాళ్లు తమ బ్యాట్ పవర్‌ని చూపించి, తమ ప్రత్యేకతను నిరూపించుకున్నారు.

1 / 5
నవంబర్ 6 శనివారం టీ20 ప్రపంచ కప్ 2021లో చాలా ప్రత్యేకమైన రోజు. సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఫార్మాట్‌లో, సుదీర్ఘమైన సిక్స్ రికార్డు కేవలం కొన్ని గంటల వ్యవధిలో రెండుసార్లు బద్దలైంది. క్రిస్ గేల్, జోస్ బట్లర్, ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆసిఫ్ అలీ వంటి పవర్ హిట్టర్ల సమక్షంలో సుదీర్ఘమైన సిక్సర్‌ల రికార్డు దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి గ్రూప్-మ్యాచ్‌లో ఆడిన ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టన్ పేరిట రాసుకున్నాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు.

2 / 5
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యానికి సమాధానంగా ఇంగ్లండ్‌ టీం తరపున బ్యాటింగ్‌కు వచ్చిన లివింగ్‌స్టన్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ ప్రారంభంలో కగిసో రబాడ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. వీటిలో మొదటి సిక్స్ 112 మీటర్ల దూరం వెళ్లింది. ఇది టోర్నమెంట్‌లో భారీ సిక్స్‌గా రికార్డు నెలకొల్పింది.

3 / 5
లివింగ్‌స్టన్ దాడికి కొన్ని గంటల ముందు శనివారం ఈ రికార్డును నెలకొల్పిన ఆండ్రీ రస్సెల్ రికార్డును లివింగ్‌స్టన్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై 20వ ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఐదో బంతిని రస్సెల్ 111 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి రికార్డు సృష్టించాడు.

4 / 5
లివింగ్‌స్టన్, రస్సెల్ రికార్డులకు ముందు, టీ20 ప్రపంచ కప్ 2021లో పొడవైన సిక్స్ ఆఫ్ఘనిస్తాన్ యువ బ్యాట్స్‌మెన్ నజీబుల్లా జద్రాన్ పేరు మీద ఉంది. గ్రూప్ 2లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై జద్రాన్ 103 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.

5 / 5
అదే సమయంలో, ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. వీరిద్దరూ 102 మీటర్ల పొడవైన సిక్సర్లు బాదారు. ఆస్ట్రేలియాపై తన తుఫాను ఇన్నింగ్స్‌లో బట్లర్ ఈ భారీ షాట్ ఆడాడు. అయితే స్కాట్లాండ్‌పై గప్టిల్ బంతిని చాలా దూరం పంపించాడు.