Shoaib Akhtar: ధోని కెప్టెన్సీపై షోయబ్ అక్తర్ ప్రశంసలు.. కోహ్లీ, రోహిత్ నాయకత్వంలో లోపాలున్నాయంటూ..

|

Aug 18, 2023 | 8:45 PM

Shoaib Akthar: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోని తన ఆటగాళ్లను కాపాడుకుంటాడని, వారిపై ఎలాంటి ఒత్తిడి పట్టడని చెప్పుకొచ్చాడు అక్తర్. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో అలా జరగదని వారిలో లోపాలు ఉన్నాయని ఆ కారణంగానే పెద్ద పెద్ద టోర్నీల్లో భారత్ గెలవలేకపోతుదంటూ బాంబ్ పేల్చాడు. షోయబ్ మొత్తంగా టీమిండియా క్రికెటర్ల కెప్టెన్సీపై ఏమన్నాడంటే..

1 / 5
Shoaib Akthar: తన బౌలింగ్ స్పీడ్‌తో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన షోయబ్ అక్తర్ వేగంతోనే కాక మాటల చాతుర్యంతోనూ గుర్తింపు పొందాడు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడిన షోయబ్.. రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్, కానీ చాలా సందర్భాల్లో పానిక్ అవుతుంటాడని అన్నాడు. ఈ కారణంగానే తన జట్టులోని ప్లేయర్లపై కేకలు వేస్తే బాధగా కనిపిస్తాడని అక్తర్ చెప్పుకొచ్చాడు.

2 / 5
అనంతరం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ ఎప్పుడూ చాలా దూకుడుగా కనిపిస్తాడని అది అన్ని వేళలా పని చేయదని షోయబ్ అభిప్రాయపడ్డాడు.

3 / 5
ఇలా రోహిత్, కోహ్లీ కెప్టెన్సీల్లో లోపాలున్నాయని చెప్పిన షోయబ్.. ధోని నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని ఎప్పుడూ తన ప్లేయర్లకు మద్ధతుగా నిలుస్తాడని, వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టడని, ఈ కారణంగానే మహీ గొప్ప కెప్టెన్ అని షోయబ్ అన్నాడు.

4 / 5
ధోని నాయకత్వంలోనే భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందని ఈ సందర్భంగా షోయబ్ గుర్తు చేశాడు.

5 / 5
ఇదిలా ఉండగా.. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ అక్టోబర్ 14న టీమిండియాతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్తాన్‌లోని అభిమానులే కాక యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది.