
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదలైన వర్షం అస్సలు ఆగలేదు. కొద్దిసేపు కూడా పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించేందుకు వర్షం అనుమతించలేదు. దీంతో చివరకు మ్యాచ్ రద్దయింది.

ఇండో-పాక్ పోరు రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. తద్వారా భారత్‌కు ఒక పాయింట్ లభించగా, తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్థాన్ ఖాతాలో మొత్తం 3 పాయింట్లు లభించాయి. దీని ద్వారా బాబర్ సేన సూపర్-4 దశకు చేరుకుంది.

అయితే, భారత్ తదుపరి స్థాయికి వెళ్లే మార్గం అంత సులభం కాదు. తర్వాతి మ్యాచ్ గెలవాలి అయితే, ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలా జరిగినా టీమిండియా సూపర్-4లోకి ప్రవేశిస్తుంది. ఇలా కాకుండా భారత్ తదుపరి మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ని నేపాల్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 4, సోమవారం పల్లకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా వరుణుడి ముప్పు ఉంటుందని అంటున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో 76 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

ఒకవేళ భారత్-నేపాల్ మ్యాచ్ కూడా రద్దు అయితే, టీమిండియాకు మరో పాయింట్ దక్కుతుంది. మొత్తం 2 పాయింట్లతో భారత్ సూపర్ 4 దశకు చేరుకుంటుంది. కాబట్టి టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్‌లో గెలవాలి లేదా మ్యాచ్‌ను రద్దు అవ్వాల్సి ఉంటుంది.

ఆసియా కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే అని ఫిక్స్ చేయలేదు. మ్యాచ్ ప్రారంభానికి వర్షం అంతరాయం కలిగించిన తర్వాత కొంత సమయం వేచి ఉన్న తర్వాత ఇంకా సమయం ఉంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. రెండో బ్యాటింగ్ సమయంలో వర్షం అంతరాయం కలిగితే, డక్‌వర్త్ లూయిస్ నియమం అమలు చేస్తారు.

ఆసియాకప్ పాయింట్ల పట్టికలో చూస్తే పాకిస్థాన్ మొత్తం 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 3 పాయింట్లతో సూపర్-4 దశలోకి ప్రవేశించింది. భారత్ 1 పాయింట్‌తో రెండో స్థానంలో ఉండగా, నేపాల్ ఒక్క మ్యాచ్‌లో ఓడి పాయింట్లు లేకుండా చివరి స్థానంలో ఉంది.

గ్రూప్-బిలో శ్రీలంక అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇంకా ఏ మ్యాచ్ ఆడలేదు. నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాదేశ్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఆడిన ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రన్ రేట్ -0.951లుగా నిలిచింది.