
భారత్ ఇప్పటివరకు 9 సార్లు ఆసియా కప్ ఫైనల్‌లో ఆడింది. అలాగే 10వ సారి లంకపై ఆడేందుకు కూడా సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత బౌలర్లకు మంచి రికార్డ్ ఉంది.

ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ప్లేయర్‌గా ఆశిష్ నెహ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. 3 ఫైనల్స్ ఆడిన నెహ్రా మొత్తం 6 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు.

భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు. 2 సార్లు టోర్నీ పైనల్స్ ఆడిన కపిల్ మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు.

రెండు సార్లు ఆసియా కప్ ఫైనల్స్ ఆడి 4 వికెట్లను తీసిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మూడో స్థానంలో ఉన్నాడు.

కాగా, ఇప్పటివరకు మూడు ఫైనల్స్ ఆడిన రవీంద్ర జడేజా 3.. 2018 ఆసియా కప్ ఫైనల్‌లో ఆడిన కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి సమంగా నాల్గో స్థానంలో ఉన్నారు.

అంటే ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఎదిగేందుకు ఈ ఇద్దరికీ ఇప్పుడు సువర్ణావకాశం లభించబోతున్నట్లే. లంకపై నేడు జరిగే ఫైనల్‌లో వీరు వ్యక్తిగతంగా 3 వికెట్లు తీస్తే నెహ్రా.. 2 వికెట్లు తీస్తే కపిల్ దేవ్.. ఓ వికెట్ తీస్తే ఇర్ఫాన్ రికార్డ్ సమం అవుతాయి.

ఒకవేళ జడేజా కానీ, కుల్దీప్ కానీ నేటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీస్తే.. చరిత్రను తిరగరాయాల్సిందే. 4 వికెట్లు పడగొట్టిన వారు ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్రస్థానాన్ని అధిరోహిస్తారు.