
Rakshabandhan 2022: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నేడు రక్షాబంధన్ పండగను జరుపుకుంటున్నారు. ఈక్రమంలో అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టడం, బదులుగా వారు విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టులోని స్టార్ క్రికెటర్ల సోదరీమణులు, వారెం చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం రండి.

విరాట్ కోహ్లి సోదరి పేరు భావనా కోహ్లీ. కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా ఎదగడంలో ఆమెది కీలక పాత్ర. ముఖ్యంగా తండ్రి మరణానంతరం కోహ్లీ కోసం ఆమె చాలా చేసింది.

ఇక భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని స్టార్‌గా మార్చడంలో అతని సోదరి జయంతి గుప్తా పాత్ర ఎంతో ఉంది. ఈ విషయాన్ని ధోని బయోపిక్‌లో కూడా చూపించారు. అయితే ధోని సోదరి ఇంగ్లిష్ టీచర్ అని చాలా తక్కువ మందికి తెలుసు.

తల్లి మరణం తర్వాత రవీంద్ర జడేజా బాధ్యతలను అతని సోదరి నైనా నిర్వహించింది. నైనా నర్సింగ్ వృత్తిని కొనసాగిస్తూనే తన సోదరుడు క్రికెటర్‌గా దోహదం చేసింది. జడేజాకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి కన్నుమూసింది.

శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ వృత్తిరీత్యా డ్యాన్సర్. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్. తన సోదరుడితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది శ్రేష్ఠ.

భారత వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ చెల్లెలు సాక్షి పంత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో చదువుతోంది. అప్పుడప్పుడూ తన సోదరునితో కలిసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది.