
Jos Buttler: ఇంగ్లాండ్ టీ20 కెప్టెన్ జోస్ బట్లర్‌కి రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అందుకు అతను టీ20 క్రికెట్‌లో సత్తా చాటడమే కారణం. అయితే అది ఐపీఎల్ ఆడడానికి మాత్రమే కాదు.

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్, వెస్టిండీస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ఉన్నాయి. విదేశాల్లోని ఇతర లీగ్‌లలో కూడా కొత్త జట్లను కొనుగోలు చేయడానికి కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆసక్తి చూపుతోంది.

ఆయా లీగ్‌లోని తమ జట్లు అన్నింటికీ ఆడేందుకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జోస్ బట్లర్‌తో శాశ్వత ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసమే ఇంగ్లీష్ ప్లేయర్‌కి రాజస్థాన్ బేస్‌డ్ ఫ్రాంచైజీ రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చింది.

అయితే ఇందుకోసం జోస్ బట్లర్ తన జాతీయ జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయ్ ఇప్పటికే జాతీయ జట్టు కాంట్రాక్టును ముగించుకుని మేజర్ లీగ్ క్రికెట్ వైపు మళ్లాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా న్యూజిలాండ్ జాతీయ జట్టుతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుని లీగ్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నాడు.

ఇదే తరహాలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా జోస్ బట్లర్‌ని ఆకర్షించేందుకు అతనికి రూ.40 కోట్లు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ కోసం బట్లర్ తన జాతీయ జట్టు ఒప్పందాన్ని రద్దు చేయాల్సి రావచ్చు.

ఎందుకంటే ఈ కాంట్రాక్టుల ప్రకారం అతను ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్‌ల సమయంలో జాతీయ జట్టుకు ఆడలేడు. మరి ఓ వైపు భారీ ఆఫర్, మరోవైపు నేషనల్ టీమ్.. ఈ పరిస్థితుల్లో బట్లర్ ఏ విధంగా స్పందిస్తాడో అని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.