భారత్-వెస్టిండీస్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్‌పై 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.
ఈ లిస్టులో విండీస్ మాజీ ప్లేయర్ మాల్కో మార్షల్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‌పై 17 మ్యాచ్‌లు ఆడిన మాల్కో మొత్తంగా 76 వికెట్లు తీసుకున్నాడు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ లిస్టు మూడో స్థానంలో ఉన్నాడు. కరేబియన్లపై 17 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే 74 వికెట్లు పడగొట్టాడు.
తాజాగా ముగిసిన భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో 12 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ ఆశ్విన్ ఈ లిస్టు నాల్గో స్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా విండీస్ టీమ్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన ఆశ్విన్ 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇది ఆశ్విన్ కంటే ముందు ఉన్నవారి కంటే చాలా వేగవంతమైన ఫీట్ కావడం విశేషం. ఇంకా విండీస్‌పై కపిల్, కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ప్లేయర్‌గా కూడా రికార్డుల్లో నిలిచాడు.
భారత్-వెస్టిండీస్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 5వ ఆటగాడిగా టీమిండియా మాజీ ప్లేయర్ శ్రీనివాస్ వెంకటరాఘవన్ ఉన్నాడు. విండీస్‌తో 23 మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్ మొత్తం 68 వికెట్లు తీసుకున్నాడు.