
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ హరీస్ రౌఫ్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తనతో కలిసి చదువుకున్న ముజ్నా మసూద్ మాలిక్‌తో కలిపి పెళ్లిపీటలెక్కాడీ ఫాస్ట్ బౌలర్.

శనివారం ఇస్లామాబాద్‌లో రౌప్- ముజ్నాల పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. నిఖా సందర్భంగా హరీస్ తెల్లటి షేర్వానీలో ముస్తాబు కాగా అతని భార్య బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిన వైట్ లెహంగాలో మురిసిపోయింది.

ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు క్రికెటర్లు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

హరీస్ వివాహానికి పాకిస్థాన్ జట్టులోని పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. శనివారం తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా నియమితులైన షాహిద్ అఫ్రిది, అతని కాబోయే అల్లుడు షాహిన్ షా ఆఫ్రిది, లాహోర్ ఖలందర్స్‌కు చెందిన సమీర్ రాణా, అతిఫ్ రాణా, ఆకిబ్ జావేద్ కూడా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

హారిస్ రావల్పిండిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. కానీ అదే మ్యాచ్‌లో గాయపడి సిరీస్‌కు దూరమయ్యాడు