ఇష్ సోధి: న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న మ్యాజికల్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి భారత సంతతికి చెందిన ఆటగాడు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సిక్కు కుటుంబంలో సోధి జన్మించాడు. అయితే సోధి 4 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయి అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో క్రికెటర్‌గా మారిన సోధి ఇప్పుడు బ్లాక్ క్యాప్ టీమ్‌లో ప్లేయర్. ఇక భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో కూడా సోధి న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. సోధి ఇప్పటికే న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 46 వన్డేలు, 19 టెస్టులు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
రచిన్ రవీంద్ర: వన్డే వరల్డ్ కప్‌లో ఇతర దేశాల తరఫున ఆడుతున్న మరో భారతీయుడు రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారత సంతతికి చెందినవాడే. అతను వెల్లింగ్టన్‌లో జన్మించినా.. అతని తల్లిదండ్రులు భారతీయులే. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి స్వస్థలం బెంగళూరు. అయితే ఉద్యోగం కారణంగా కృష్ణమూర్తి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఇక న్యూజిలాండ్‌లోనే జన్మించిన రచిన్ రవీంద్ర ఇప్పుడు బ్లాక్ కాప్ టీమ్‌లో సభ్యుడు. రచిన్ బ్లాక్ క్యాపర్‌గా ఇప్పటివరకు 3 టెస్టులు, 9 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
విక్రమ్‌జిత్ సింగ్: నెదర్లాండ్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ విక్రమజీత్ సింగ్ 2003లో పంజాబ్ రాష్ట్రం, చీమా ఖుర్ద్‌లోని ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తాత ఖుషీ చీమా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో నెదర్లాండ్స్‌కు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశారు. అక్కడే ఉన్నా అతని కుటుంబం తరచూ భారత్‌ని సందర్శిస్తూనే ఉండేది. అయితే విక్రమ్‌జీత్‌కు 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని కుటుంబం పూర్తిగా నెదర్లాండ్స్‌కు మారింది. ఆ తర్వాత నెదర్లాండ్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్న విక్రమ్‌జిత్ ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌లో డచ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. విక్రమ్‌జిత్ ఇప్పటివరకు 25 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఉస్మాన్ ఖవాజా: ఆస్ట్రేలియా టీమ్ స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వచ్చే ప్రపంచకప్ కోసం ఎంపియ చేసిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. ఆసీస్ తరఫున చాలా కాలంగా ఆడుతున్న ఖవాజా పాకిస్థాన్‌కి చెందిన వ్యక్తి. ఖవాజా ఇస్లామాబాద్‌లోనే జన్మించినా.. అతను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. అలా ఆస్ట్రేయలిన్‌గా మారిన ఖవాజా కంగారుల జట్టులో సభ్యుడయ్యాడు. అలా ఇప్పటివరకు 66 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడ.
అదిల్ రషీద్: ఇంగ్లాండ్ జట్టులోని అనుభవజ్ఞ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పాకిస్థాన్ మూలానికి చెందిన ఆటగాడు. కశ్మీర్‌లోని మీర్పూర్ కమ్యూనిటీకి చెందిన అతని కుటుంబం 1967లో ఇంగ్లాండ్‌కి వలస వెళ్లింది. అలా వెళ్లిన 21 ఏళ్ల తర్వాత అంటే 1988లో అదిల్ రషిద వెస్ట్ యార్క్‌షైర్‌లో జన్మించాడు. అక్కడే పుట్టి పెరిగిన రషిద్ ఇప్పుడు వరల్డ్ కప్ 2023 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నారు. రషిద్ ఇప్పటికే ఇంగ్లాండ్ తరఫున 126 వన్డేలు, 19 టెస్టులు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.