Ranji Trophy 2022: ఐపీఎల్‌లో ఘోర వైఫల్యం.. కట్ చేస్తే.. రంజీల్లో రెండో సెంచరీతో దూకుడు పెంచిన యంగ్ ప్లేయర్..

|

Jun 09, 2022 | 7:20 AM

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. 45 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తర్వాతి ఇన్నింగ్స్‌లో మాత్రం జైస్వాల్ బ్యాట్ అద్భుతంగా ఆకట్టుకుంది.

1 / 5
ముంబై యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ తర్వాత రంజీ ట్రోఫీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ సాధించి ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు.

2 / 5
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. 45 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తర్వాతి ఇన్నింగ్స్‌లో మాత్రం జైస్వాల్ బ్యాట్ అద్భుతంగా ఆకట్టుకుంది. 2019లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసి సెంచరీ చేసి చిరస్మరణీయంగా నిలిచిన జైస్వాల్‌కి ఇది కేవలం రెండో మ్యాచ్ మాత్రమే. జైస్వాల్ 150 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 103 పరుగులు చేశాడు.

3 / 5
మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే షా 80 బంతుల్లో 72 పరుగులు చేసి దిక్షాంశు బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీని తర్వాత క్రీజులో నిలిచిన జైస్వాల్ ఆదిత్య తారేతో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 57 పరుగుల వద్ద తారే ఔటయ్యాడు.

4 / 5
103 పరుగులు చేసిన తర్వాత యశస్వి మయాంక్ మిశ్రా చేతికి చిక్కి, పెవిలియన్ చేరాడు. మయాంక్ వేసిన బంతికి స్వప్నిల్ చేతికి చిక్కాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై మూడు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేయగా ప్రస్తుతం 794 పరుగుల ఆధిక్యం సాధించింది.

5 / 5
గత నెలలో ముగిసిన ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 258 పరుగులు చేశాడు. కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు.