
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీన జట్టు విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ఛాంపియన్ కావాలన్న లియోనెల్ మెస్సీ కల సాకరమైంది.

ఈ విజయంతో మరోసారి మెస్సీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. మెస్సీ విజయంతో భారత్‌లోనూ సంబరాలు జరిగాయి. ఈక్రమంలో ఉంటే భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవాకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను పంపి ఆశ్చర్యపరిచాడు సాకర్ దిగ్గజం.

ధోని సతీమణి సాక్షి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. లైక్ ఫాదర్.. లైక్ డాటర్ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో లో జీవా మెస్సీ జెర్సీని ధరించి ఉండడం మనం చూడవచ్చు.

ఈ జెర్సీపై మెస్సీ ఆటోగ్రాఫ్ కూడా ఉండడం విశేషం. కాగా మెస్సీ అందించిన గిఫ్ట్‌తో తెగ సంబరపడిపోతంది జివా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

ధోనీకి ఫుట్ బాల్ ఎంతో ఇష్టం. అందుకే ఇండియన్ సూపర్ లీగ్ జట్టు చెన్నైయిన్ ఎఫ్‌సీకి కో- ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.