
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కెప్టెన్సీలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021)ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. CSK ప్లేఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా అవతరించింది. గత సంవత్సరం నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత సీఎస్‌కే ఈ సంవత్సరం అద్భుతమైన పునరాగమనం చేసింది. జట్టు బ్యాట్స్‌మెన్‌లు మంచి ఫాంలో కనిపిస్తున్నారు. కానీ, ఈ సీజన్‌లో సీఎస్‌కే జట్టు కెప్టెన్ మాత్రం మసకబారిపోయాడు. ఈ సీజన్‌లో ధోనీ బ్యాట్ నుంచి పరుగులు పెద్దగా రాలేదు. అదే సమయంలో అతను ఐపీఎల్ 2021 లోనే కాదు ధోని ఫ్యాన్స్‌కు ఓ ఇబ్బందికరమైన రికార్డును సృష్టించింది. ఇది ప్రస్తుతం ధోని సామర్థ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.

ఐపిఎల్ 2021 సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ధోనీ బ్యాట్ కేవలం 83 పరుగులు మాత్రమే చేసింది. అత్యుత్తమ స్కోరు 18 పరుగులుగా మాత్రమే ఉంది. అతను 98.80 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు సాధించాడు. ధోని ఈ స్ట్రైక్ రేట్ ప్రస్తుతం 14 ఐపీఎల్ సీజన్‌లతో పోలిస్తే అతి తక్కువగా నమోదైంది. ఐపీఎల్ సీజన్‌లో ధోని బ్యాట్ 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌లో పరుగులు చేయడం ఇదే మొదటిసారి.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై 66.66 స్ట్రయిక్ రేట్ వద్ద ధోనీ పరుగులు సాధించాడు. ధోనీ ఈ స్ట్రైక్ రేట్ ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువగా ఉంది. ఢిల్లీపై ధోని 27 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దాదాపు 46 నిమిషాల పాటు ధోనీ క్రీజులో ఉన్నాడు. ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు.

ఐపీఎల్ చరిత్రలో ధోని అత్యుత్తమ స్ట్రైక్ రేట్ 2013 సీజన్‌లో ఉంది. 162.89 స్ట్రైక్ రేట్ వద్ద 461 పరుగులు చేశాడు. దీని కోసం అతను 18 మ్యాచ్‌లు ఆడాడు. అత్యుత్తమ స్కోరు 67 నాటౌట్‌గా నమోదైంది. అదే సమయంలో స్ట్రైక్ రేట్ పరంగా అతని రెండవ అత్యుత్తమ సీజన్ 2011గా ఉంది. ధోని 16 మ్యాచ్‌లలో 158.70 స్ట్రైక్ రేట్‌తో 392 పరుగులు సాధించాడు.

గత సీజన్‌లో ధోని స్ట్రైక్ రేట్ 116.27, అతను 14 మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ధోని ఇప్పటివరకు మొత్తం 217 మ్యాచ్‌లు ఆడి, 4715 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 84 నాటౌట్. మొత్తం మీద ధోని స్ట్రైక్ రేట్ 135.83గా నమోదైంది.