Team India: ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు పడగొట్టింది వీరే.. టాప్ జాబితాలో ఎవరున్నారంటే?

|

Sep 23, 2023 | 8:59 PM

Mohammed Shami: ఈ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ 51 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అది కూడా హర్భజన్, శ్రీనాథ్, అగార్కర్‌లను అధిగమించడం విశేషం. అయితే వన్డే క్రికెట్‌లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు ఎవరో చూద్దాం..

1 / 8
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కీ ప్లేయర్‌గా నిలిచాడు.

2 / 8
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ 51 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు.

3 / 8
ఈ ఐదు వికెట్లతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. అది కూడా హర్భజన్, శ్రీనాథ్, అగార్కర్‌లను అధిగమించడం విశేషం. అయితే వన్డే క్రికెట్‌లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు ఎవరో చూద్దాం...

4 / 8
1- కపిల్ దేవ్: భారత మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఆస్ట్రేలియాతో 41 వన్డేలు ఆడాడు. మొత్తంగా 45 వికెట్లు తీసి, ఆసీస్ పై అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ గా నిలిచాడు.

5 / 8
2- మహ్మద్ షమీ: మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు తీసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 32 మ్యాచ్‌ల్లో షమీ మొత్తం 37 వికెట్లు పడగొట్టాడు.

6 / 8
3- అజిత్ అగార్కర్: ఆస్ట్రేలియాతో 21 వన్డేల్లో బౌలింగ్ చేసిన అగార్కర్ మొత్తం 36 వికెట్లు పడగొట్టాడు.

7 / 8
4- జవగల్ శ్రీనాథ్: మైసూర్ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన జావగల్ శ్రీనాథ్ ఆస్ట్రేలియాతో 29 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు తీశాడు.

8 / 8
5- హర్భజన్ సింగ్: ఆస్ట్రేలియాతో 35 వన్డేలు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.