ఐపీఎల్ 2023: 16వ సీజన్ ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఐపీఎల్‌లో మూడో అత్యల్ప స్కోర్‌కే ఔట్ అయిన టీమ్‌గా రాజస్థాన్ నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరుకు ఔట్ అయిన చెత్త రికార్డును కలిగి ఉంది. కానీ ఆర్సీబీ జట్టు మరో జట్టును 2 సార్లు 60 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడం విశేషం.
అసలు ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోర్‌కే ఔట్ అయిన జట్లు ఏవో ఇప్పుడు చూద్దాం...
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆర్‌సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక జట్టు సాధించిన అత్యల్ప స్కోరు ఇదే.
2. రాజస్థాన్ రాయల్స్: 2009 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఐపీఎల్ క్రికెట్‌తో 2వ అత్యల్ప స్కోరుకే అలౌట్ అయిన టీమ్‌గా రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది.
3. రాజస్థాన్ రాయల్స్: తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో RCB మరోసారి రాజస్థాన్ రాయల్స్‌ను 60 కంటే తక్కువ పరుగులకే కట్టడి చేసింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఆర్‌సీబీ 59 పరుగులకే కట్టడి చేసింది.
4. ఢిల్లీ డేర్‌డెవిల్స్: 2017లో ముంబై ఇండియన్స్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ని కేవలం 66 పరుగులకే కట్టడి చేసింది.
5. ఢిల్లీ క్యాపిటల్స్: ముంబై ఇండియన్స్ కంటే ముందుగా పంజాబ్ కింగ్స్ అదే 2017 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టును 67 పరుగులకే ఆలౌట్ చేసింది.