
ప్రముఖ ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చారు.

4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను ఇచ్చారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ సామర్థ్యం గల పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3GB వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాకు ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంట్లో ట్రిపుల్ సెటప్ రెయిర్ కెమెరాను అందించారు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు అందించారు. ఈ కెమెరాతో 1080 పీ ఫుల్ హెచ్‌డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.

ధర విషయానికొస్తే లావా బ్లేజ్ ఎన్‌ఎక్స్‌టీ రూ. 9,299గా ఉంది. బ్లూ, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉందీ ఫోన్. ఇదిలా ఉంటే ఈ ఫోన్ తొలి సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అమెజాన్‌లో సేల్ నిర్వహించనున్నట్లు సమాచారం.