IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో స్పిన్నర్లదే హవా.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

|

Apr 11, 2022 | 12:49 PM

పర్పుల్ క్యాప్ ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక ఆ 5 మ్యాచ్‌ల్లో..

1 / 5
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్-15లో 4 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 16 ఓవర్లలో 104 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆదివారం లక్నోపై తీసిన 4 వికెట్లు కూడా ఉన్నాయి.

2 / 5
పర్పుల్ క్యాప్ ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక ఆ 5 మ్యాచ్‌ల్లో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేష్ 132 పరుగులు ఇచ్చాడు.

3 / 5
పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు కుల్దీప్ 4 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. వాటిలో ఆదివారం కేకేఆర్‌పై 4 వికెట్లు తీశాడు. చైనామన్ బౌలర్ 15.4 ఓవర్లలో 116 పరుగులు ఇచ్చాడు.

4 / 5
పర్పుల్ క్యాప్ ఫైట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈసారి ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 6 వికెట్లు తీశాడు. ఇక ఈ RCB క్రికెటర్ 18 ఓవర్లలో 120 పరుగులు ఇచ్చాడు.

5 / 5
ఈ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన అవేష్ ఖాన్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అవేష్ 15 మ్యాచ్‌లు ఆడి 18.4 ఓవర్లలో 156 పరుగులు చేశాడు. అలాగే 6 వికెట్లు పడగొట్టాడు.