
IPL ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తరలిపోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.

గత రెండు ఎడిషన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న షమీ ఆ జట్టు బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాలు నొప్పితో బాధపడుతున్న షమీ లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు.

షమీ సంగతి పక్కన పెడితే గుజరాత్ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఈ ఐపీఎల్ ఆడడం అనుమానంగానే ఉంది. గాయంతో బాధపడుతోన్న ఈ మిస్టరీ స్పిన్నర్ ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

రషీద్ ఖాన్ ఐపీఎల్ ఆడతాడా? లేదా? అన్నది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉంది. ఒక వేళ ఆడినా మొదటి దశ మ్యాచ్ లకు రషీద్ ఖాన్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

2022లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించారు షమీ, రషీద్ ఖాన్. ఇప్పుడు ఇద్దరూ జట్టులో లేకపోనయిట్లయితే గిల్ సేనకు భారీ ఎదురుదెబ్బలు తగిలినట్టే.