Indian Premier League 2023: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గత సీజన్ కంటే IPL 16వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. చెన్నై టీం ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికే చెందుతుంది. మహేంద్ర సింగ్ ధోని గురించి ఈ సీజన్ ప్రారంభం కాకముందే, ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో చివరి సీజన్ కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ, ఈ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో వచ్చే ఏడాది ఆడడని వార్తలు పుంజుకున్నాయి. ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత సారథి ఎవరంటూ సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ నిష్క్రమణ తర్వాత అతని స్థానంలో జట్టుకు కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారనే పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సమయంలో, రేసులో ముందంజలో ఉన్న ఇద్దరు పేర్లు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, మొదటిసారి CSK లో భాగమైన అజింక్యా రహానే వైపే అందరి చూపు నిలిచింది.
ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు బ్యాట్‌తో అనూహ్యంగా రాణిస్తున్నాడు. గైక్వాడ్ యువ ఆటగాడు కావడంతో కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ధోనీకి వీడ్కోలు పలికిన తర్వాత ఈ బాధ్యతను నెరవేర్చేందుకు గైక్వాడ్ CSK టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు తదుపరి కెప్టెన్‌గా అజింక్యా రహానే ఎంపిక కూడా ఉంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమైన రహానే.. ఇప్పటివరకు తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా రహానేకు ఉంది. రహానే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 25 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో 9 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.
ఈ రెండు పేర్లు కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇతర కెప్టెన్సీ ఎంపికల విషయానికి వస్తే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా పేర్లు ముందంజలో ఉన్నాయి. గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతలను కూడా జడేజా అందుకున్నాడు. అయితే జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా, సీజన్ మధ్యలో ధోనీ మళ్లీ ఈ బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది.