IPL 2022: 4 ఏళ్ల చెత్త రికార్డులో చేరిన కేకేఆర్ బౌలర్.. అదేంటంటే?

|

May 08, 2022 | 2:20 PM

IPL చరిత్రలో కేకేఆర్ బౌలర్ అత్యంత ఖరీదైన ఓవర్‌ను శివమ్ మావి బౌల్ చేశాడు. ఇది అతని తొలి సీజన్‌లో రెండుసార్లు జరిగింది. ప్రస్తుతం కొత్త సీజన్‌లో అతని మునుపటి అన్ని గణాంకాలను బద్దలు కొట్టాడు.

1 / 4
IPL 2022లో ఒక ఓవర్‌లో బౌలర్‌ను దారుణంగా దెబ్బతీసిన దృశ్యాలు కొన్ని మ్యాచ్‌లలో మాత్రమే కనిపిస్తుంటాయి. ఒక నెల క్రితం, ముంబై ఇండియన్స్ ప్లేయర్ డేనియల్ సామ్స్ ఓవర్లో 35 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఒక కేకేఆర్ బౌలర్ కూడా చేరాడు. అతని ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిసింది.

2 / 4
కేకేఆర్ యువ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావికి మే 7 శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ చాలా చెడ్డదిగా తయారైంది. ఈ మ్యాచ్‌లో తొలి 3 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన అతను చివరి ఓవర్‌లో మాత్రం చాలా పరుగులు అందించాడు. 19వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన మావిపై వరుసగా 3 సిక్సర్లు, మొత్తంగా 5 సిక్సర్లు బ్యాటర్లు బాదేశారు.

3 / 4
LSG బ్యాటర్స్ మార్కస్ స్టోయినిస్ మావీపై దాడిని ప్రారంభించాడు. మావి వేసిన ఓవర్ తొలి 3 బంతుల్లోనే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వరుసగా సిక్సర్లు బాదాడు. అతను నాల్గవ బంతిని కూడా బౌండరీ వైపు తరలించాడు. కానీ, మావీ అదృష్టం వరించడంతో బౌండరీ వద్ద క్యాచ్‌గా మారింది. అయితే మళ్లీ క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు.

4 / 4
ఈ విధంగా శివమ్ మావీ తన 4 ఓవర్లలో మొత్తం 50 పరుగులు ఇచ్చి, కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అయితే ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి కాదు. ఈ మ్యాచ్‌కు ముందు 2018లో అరంగేట్రం సీజన్‌లో ఢిల్లీపై 29, రాజస్థాన్‌పై 28 పరుగులు మావీ ఓవర్‌లో వచ్చాయి.