ఐపీఎల్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. ఐపీఎల్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనతో టీంకు విజయాలు ఇవ్వడమేగాక, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అలాంటి ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
ఏబీ డివిలియర్స్.. ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడుతున్నాడు. గత కొన్నేళ్లుగా ఆర్‌సీబీ ట్రబుల్షూటర్‌గా మారిన డివిలియర్స్ ఐపీఎల్‌లో 176 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 5056 పరుగులు పూర్తి చేశాడు. అలాగే అత్యధికంగా 25 సార్లు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొంది అగ్రస్థానంలో నిలిచాడు.
విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతిపెద్ద గుర్తింపు పొందిన క్రిస్ గేల్ 140 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4950 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. మొత్తం 22 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ లీగ్‌లో 207 మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 18 సార్లు తన ప్రదర్శనకుగాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ ఐపీఎల్‌లో 5480 పరుగులు చేశాడు. రోహిత్ ఖాతాలో 15 వికెట్లు ఉన్నాయి. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రేలియన్ లెజెండ్ డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇద్దరూ ఈ అవార్డును తలో 17 సార్లు అందుకున్నారు. వార్నర్ 148 మ్యాచ్‌ల్లో 5447 పరుగులు చేయగా, ధోనీ 212 మ్యాచ్‌ల్లో 4672 పరుగులు చేశాడు.