
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అలాగే స్మిత్ అందమైన భార్య డానీ విల్లీస్‌ను చూసే అవకాశం లేదు. డానీ ప్రతి ఐపీఎల్‌లో స్మిత్‌తో కలిసి ఇండియాకు వచ్చేది.

డానీ విల్లీస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె అందం స్పష్టంగా కనిపిస్తుంది. దుస్తుల నుండి బ్యాగ్‌ల వరకు, విల్లీస్ ఫ్యాషన్ సెన్స్‌కు కేరాఫ్ అడ్రస్. విల్లీస్ చిత్రాలకు నెటిజన్ల నుంచి లైకుల వర్షం కురుస్తుంటుంది.

స్మిత్ క్రికెటర్ అయితే, అతని భార్య న్యాయవాది. ఆమె 2017 సంవత్సరంలో మాక్వేరీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. డాని విల్లీస్, స్టీవ్ స్మిత్ 2011లో ఒక బార్‌లో జరిగిన బిగ్ బాష్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో మొదటిసారిగా కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు మనసులు కలవడంతో డేటింగ ప్రారంభించారు. స్మిత్, డానీ డేటింగ్ ప్రారంభించినప్పుడు, ఆమె ఇంకా కాలేజీలో చదువుతోంది. 2017 లో స్మిత్ డానీకి ప్రపోజ్ చేశాడు. 2018లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కాగా డానీ కాలేజీ సమయంలో స్పోర్ట్స్ పర్సన్. ఆమె స్విమ్మర్ అలాగే పోలో ప్లేయర్ కూడా. అందుకే క్రికెట్ కెరీర్ పరంగా స్మిత్‌ను బాగా అర్థం చేసుకుంది డానీ. ముఖ్యంగా నిషేధానికి గురైనప్పుడు అతనికి అండగా నిలిచింది.

స్మిత్ ఈసారి ఐపీఎల్ వేలానికి తన పేరును ఇవ్వలేదు ఎందుకంటే గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నప్పుడు అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. టెస్ట్ ఫార్మాట్‌కు తనను తాను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఐపీఎల్‌ను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.