IND vs WI: క్రికెట్ దేవుడి రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ, రోహిత్‌.. ఎలైట్ లిస్టులో ఎవరున్నారో తెలుసా?

|

Jul 26, 2023 | 12:56 PM

India Vs West Indies: వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కీలక మైలురాళ్లపై కన్నేశారు. ముఖ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ లిస్టులో చేరేందుకు సిద్ధమయ్యారు.

1 / 7
వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలక మైలురాళ్లపై కన్నేశారు.

2 / 7
ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జులై 27న బార్బడోస్‌లో జరగనుంది. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ లేదా 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగులు పూర్తి చేస్తాడు.

3 / 7
దీంతో పాటు అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం నెం.1 ర్యాంక్‌లో ఉన్న క్రికెట్ దేవుడు 321 వన్డే మ్యాచ్‌ల్లో 13000 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

4 / 7
ప్రస్తుతం కోహ్లి 50 ఓవర్ల ఫార్మాట్‌లో 274 మ్యాచ్‌లు ఆడి 12898 పరుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీకి ఇప్పుడు కేవలం 102 పరుగులు కావాలి.

5 / 7
కోహ్లీతో పాటు, కెప్టెన్ రోహిత్ కూడా ODI ఫార్మాట్‌లో ప్రధాన మైలురాయిపై దృష్టి సారించాడు. హిట్‌మ్యాన్‌కి 50 ఓవర్ల ఫార్మాట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 175 పరుగులు మాత్రమే అవసరం.

6 / 7
దీంతో 10,000 పరుగుల క్లబ్‌లో అడుగుపెట్టిన ఆరో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 15వ ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు.

7 / 7
ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ (18,426) మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (12,809), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రావిడ్ (10,889), ఎంఎస్ ధోని (10,773) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.