Venkata Chari |
Jul 15, 2023 | 3:55 PM
India vs West Indies: డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం యశస్వి జైస్వాల్ (171), రోహిత్ శర్మ (103) సెంచరీలతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు మోకరిల్లింది. అశ్విన్ 71 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ జట్టు 130 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో ఐదు జట్లపై 22కి పైగా టెస్టు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ప్రత్యేక రికార్డు సాధించింది.
ఆస్ట్రేలియా (32), ఇంగ్లండ్ (31), వెస్టిండీస్ (23), న్యూజిలాండ్ (22), శ్రీలంక (22)లపై భారత జట్టు ఇరవైకిపైగా టెస్టు మ్యాచ్‌లు గెలిచింది.