
టీ20 క్రికెట్‌లో 200 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. ముఖ్యంగా భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఇది మరింత తేలికగా మారుతుందడనడంలో సందేహం లేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో స్కోరు బోర్డు చాలాసార్లు 200 పరుగుల మార్కును దాటింది. భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో చేసిన 5 అతిపెద్ద స్కోర్‌లను ఇప్పుడు చూద్దాం. (ఫోటో:AFP)

భారత్ - 260/5 VS శ్రీలంక, 2017: ఇండోర్‌లోని మైదానంలో రోహిత్ శర్మ బ్యాట్ లంక బౌలర్లపై ప్రతాపం చూపించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ ఆ రోజు 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. దీని ఆధారంగా శ్రీలంకపై భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగులు చేసింది. T20I సిరీస్ లేదా మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. (ఫోటో:AFP)

శ్రీలంక - 215/5 VS ఇండియా, 2009: డిసెంబర్ 9న నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో కుమార సంగక్కర 37 బంతుల్లో 78 పరుగులు చేసి శ్రీలంకను 20 ఓవర్లలో 215 పరుగులకు చేర్చాడు. భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు.(ఫోటో:AFP)

భారత్ - 211/4 VS శ్రీలంక, 2009: మొహాలీ గ్రౌండ్‌లో సెహ్వాగ్, యువరాజ్‌ల దూకుడుతో లంక బౌలర్లు తేలిపోయారు. డిసెంబర్ 12న జరిగిన ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. 211 పరుగులు చేసింది. సెహ్వాగ్ 36 బంతుల్లో 64 పరుగులు, యువరాజ్ 25 బంతుల్లో 60 పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య ఇది మూడో అతిపెద్ద స్కోరుగా నిలిచింది.(ఫోటో:AFP)

శ్రీలంక-206/7 VS భారత్, 2009: మొహాలీ మైదానంలో భారత్ 211 పరుగులు చేసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి శ్రీలంక 206 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఇది నాలుగో అత్యధిక స్కోరుగా నిలిచింది. (ఫోటో:AFP)

భారత్-201/6 VS శ్రీలంక, 2020: భారత ఓపెనర్లు ఇద్దరూ పూణే మైదానంలో సత్తా చాటడంతో రెండు జట్ల మధ్య T20లో 5వ అత్యధిక స్కోరు నమోదైంది. భారత్ 201 పరుగులు సాధించింది. ఇందులో శిఖర్ ధావన్ 36 బంతుల్లో 52 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. (ఫోటో:AFP)