
ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బుమ్రా నేతృత్వంలోని భారత యువ జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఐర్లాండ్‌కు బయలుదేరింది.

ప్రస్తుత T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లతో సహా చాలా మంది రెగ్యులర్ ప్లేయర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. అలాగే పలువురు సీనియర్లు గైర్హాజరు కావడంతో సెలక్టర్లు బుమ్రాకు కెప్టెన్సీని అప్పగించారు.

గాయం కారణంగా సరిగ్గా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు ఐర్లాండ్‌తో బరిలోకి దిగి తన కెప్టెన్సీ తొలి సిరీస్‌లోనే తన పేరును చరిత్ర పుస్తకాల్లో లిఖించనున్నాడు.

టీ20లో ఇప్పటివరకు భారత్ 10 మంది కెప్టెన్లను చేసింది. వీరిలో 9 మంది ఫ్రంట్‌లైన్ బ్యాట్స్‌మెన్ కాగా, ఈ జాబితాలో పాండ్యా ఒక్కడే ఆల్‌రౌండర్. ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న బుమ్రా.. భారత జట్టును తన స్టైల్‌లో నడిపించి తొలి బౌలర్‌గా రికార్డులకెక్కనున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్‌లను పరిశీలిస్తే.. ఈ ఫార్మాట్‌లో తొలిసారిగా జట్టును నడిపించిన ఘనత వీరేంద్ర సెహ్వాగ్‌కే దక్కుతుంది.

సెహ్వాగ్ తర్వాత, 2007 T20 ప్రపంచ కప్ కోసం ఎంఎస్ ధోనీకి జట్టు కెప్టెన్సీని అప్పగించారు. అప్పటి నుంచి 2016 వరకు టీ20 జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. కాగా, సురేశ్ రైనా, అజింక్యా రహానే కూడా కొన్ని మ్యాచ్‌ల్లో జట్టును నడిపించారు.

తరువాత 2017లో విరాట్ కోహ్లి భారత పూర్తి సమయం వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా జట్టుకు నాయకత్వం వహించారు. 2022లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లకు కూడా టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం లభించింది.

ఈ వారంలో భారత్ 11వ టీ20 కెప్టెన్‌గా బుమ్రా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 2022లో టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. కపిల్ దేవ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన తొలి పేసర్‌గా నిలిచాడు.