Jasprit Bumrah: ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న స్టార్ ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అతని కెప్టెన్సీలో మొదటి సిరీస్‌ను గెలుచుకున్నాడు. ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా తన లయను కనుగొనడంలో సఫలమయ్యాడు.
ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు (తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు, 2వ టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు) తీసిన బుమ్రా ఇప్పుడు బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత్ తరపున ఈ ఫాస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు.
దీంతో పాటు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్‌లను బుమ్రా అధిగమించాడు.
80 మ్యాచుల్లో 96 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్.. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అలాగే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ తాను ఆడిన 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా 62 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టాడు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 92 మ్యాచుల్లో 73 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐదో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 65 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు.