చేతేశ్వర్ పుజారా తన ఇన్నింగ్స్‌లో 206 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు కొట్టాడు. అతను మూడోసారి ఇంగ్లండ్‌లో 200 కంటే ఎక్కువ బంతులను ఎదుర్కొన్నాడు. అంతకుముందు 2018 సంవత్సరంలో, నాటింగ్‌హామ్‌లో 208 బంతులు, సౌతాంప్టన్‌లో 257 బంతులు ఆడాడు. ఇంగ్లండ్‌లో అత్యధికంగా 200 బాల్స్ ఆడిన భారతీయులలో పుజారా రెండవ స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (నాలుగు సార్లు) తొలిస్థానంలో నిలిచాడు. సునీల్ గవాస్కర్ మూడుసార్లు, కేఎల్ రాహుల్ కూడా ఇంగ్లాండ్‌లో 200 ప్లస్ బంతులను మూడుసార్లు ఎదుర్కొన్నాడు. పుజారా మరో ఐదు పరుగులు చేసి ఉంటే, అది అంతర్జాతీయ క్రికెట్‌లో పుజారా స్లోగా చేసిన హాఫ్ సెంచరీగా నమోదయ్యేది. అంతకుముందు జనవరి 2021 లో బ్రిస్బేన్‌లో, అతను 196 బంతుల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ సాధించాడు. అప్పుడు అతను 211 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.