Team India: బజ్‌బాల్‌ను మడతపెట్టి.. 112 ఏళ్ల చారిత్రక రికార్డ్‌ను సమం చేసిన రోహిత్ సేన.. అదేంటంటే?

|

Mar 09, 2024 | 4:35 PM

India vs England 5th Test: భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో టీం ఇండియా వరుస విజయాలను నమోదు చేసింది. దీంతో భారత జట్టు 112 ఏళ్ల రికార్డును సమం చేసింది.

1 / 5
Indian Cricket Team: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో టీమిండియా చారిత్రక రికార్డు సృష్టించడం విశేషం.

2 / 5
టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రత్యేక రికార్డు ఉంది. ఇంతకుముందు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి అరుదైన ఫలితాలు 3 సార్లు మాత్రమే వచ్చాయి.

3 / 5
1897-98, 1901-02లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయి, ఆ తర్వాత రెండుసార్లు 4-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1912లో ఇంగ్లండ్ జట్టు ఇలాంటి ఘనత సాధించింది.

4 / 5
ఇప్పుడు వరుసగా 112 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టును 4-1 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. దీంతో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ప్రపంచంలో మూడో జట్టుగా నిలిచింది.

5 / 5
కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో టీమ్ ఇండియా ఇలాంటి అరుదైన రికార్డును లిఖించడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ (తొలి మ్యాచ్ ఆడాడు), అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ 4-1తో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ అపూర్వ విజయాన్ని నమోదు చేసిన రోహిత్ సేన.. సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.