IND vs ENG: అలాంటి పిచ్‌లు తయారుచేస్తే.. భారత్‌కే నష్టం: టెస్ట్ సిరీస్‌కు ముందే హీట్ పెంచిన ఇంగ్లండ్ ప్లేయర్

|

Jan 08, 2024 | 4:15 PM

India vs England Test Series: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు ముందు, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో భారత బౌలింగ్, పిచ్‌లపై కీలక ప్రకటన చేశాడు. దీంతో టెస్ట్ సిరీస్‌కు ముందే తన మాటలతో హీట్ పెంచేశాడు. దీంతో ఇటువైపు నుంచి కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 5 టెస్టుల్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

1 / 5
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనున్నాయి. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. అంతకుముందు, ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఒక కీలక విషయంతో అప్పుడే హీట్ పెంచేశాడు.

2 / 5
ఈ సిరీస్‌లో భారత్ స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తే.. భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ బలం తగ్గుతుందని బెయిర్‌స్టో సూచించాడు. భారత్ భిన్నమైన పిచ్‌లను తయారు చేయగలదని, ప్రస్తుతం టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చాలా సమర్థంగా ఉన్నందున స్పిన్‌కు వారు సహకరించాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు.

3 / 5
భారత్‌లోని పిచ్‌లు మలుపు తిరుగుతాయని తనకు తెలుసు. కానీ, మొదటి రోజు నుంచి మలుపు తిరుగుతాయని చెప్పలేమని, అయితే అదే జరిగితే, భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్‌లో బలం తగ్గుతుందని బెయిర్‌స్టో అన్నాడు.

4 / 5
అయితే, భారత్‌లో స్పిన్‌ సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని బెయిర్‌స్టో సిద్ధమయ్యాడు. భారత్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యమంటూ చెప్పుకొచ్చాడు. జట్టును ఇంకా ప్రకటించలేదని, అందుకే అక్షర్ పటేల్ ఆడతాడా, అశ్విన్ ఆడతాడా, కుల్దీప్ యాదవ్ ఆడతాడా అని ఆలోచించి ప్రయోజనం లేదంటూ ప్రకటించాడు.

5 / 5
తన ప్రకారం సిరీస్‌లో వికెట్లు తీయాల్సిన బాధ్యత స్పిన్నర్లపైనే కాకుండా ఫాస్ట్ బౌలర్లపై కూడా ఉంటుందని, ఇద్దరూ కలిసి 20 వికెట్లు తీయాల్సి ఉంటుందని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు.