
మొదటి మహిళల ప్రపంచ కప్ 1973లో ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లాండ్ అత్యధికంగా 5 మ్యాచ్‌లు గెలిచి10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.

తదుపరి ప్రపంచ కప్ 1978లో భారతదేశంలో జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో తొలి టైటిల్‌ను గెలుచుకుంది. భారత్‌కు ఒక్క విజయం కూడా దక్కలేదు.

1982లో న్యూజిలాండ్‌లో మూడో ప్రపంచ కప్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా మూడో టైటిల్ గెలుచుకుంది.

1988 నాలుగో ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ టైటిల్స్ సాధించింది. ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోనే జరిగింది.

1993 ప్రపంచ కప్ తిరిగి ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇంగ్లండ్ రెండో టైటిల్ గెలుచుకుంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.