ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

Updated on: Jun 27, 2025 | 9:36 PM

జూలై 2 నుంచి అమలు చేయనున్న 8 ప్రధాన క్రికెట్ నియమాలలో ఐసీసీ మార్పులు చేసింది. కానీ ఇప్పుడు ఐసీసీ టి20 ఇంటర్నేషనల్‌లో పవర్‌ప్లే ఓవర్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన మార్పు అమలులోకి రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1 / 5
T20 క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు, ICC ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. పురుషుల క్రికెట్ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పవర్‌ప్లే నియమాలలో కీలక మార్పులు తీసుకొచ్చింది.

2 / 5
కొత్త రూల్ ప్రకారం, T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో వర్షం లేదా మరేదైనా కారణం వల్ల ఇన్నింగ్స్ ఓవర్లు కుదిస్తే, పవర్‌ప్లే ఓవర్లు.. ఓవర్లకు బదులుగా బంతుల ఆధారంగా నిర్ణయించబడతాయి.

3 / 5
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లో మొదటి 6 ఓవర్లు పవర్‌ప్లే.. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఇన్నింగ్స్ 5 ఓవర్లు అయితే పవర్‌ప్లే 1.3 ఓవర్లు. 6 ఓవర్ల ఇన్నింగ్స్‌లో.. పవర్‌ప్లే 1.5 ఓవర్లు ఉంటుంది. 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే 3 ఓవర్లు ఉంటుంది. ఏదైనా కారణం చేత మ్యాచ్ 19 ఓవర్లు అయితే, పవర్‌ప్లే 5.4 ఓవర్లు ఉంటుంది. T20 క్రికెట్‌లో పవర్‌ప్లే నియమాలు జూలై 2 నుంచి అమలులో రానున్నాయి.

4 / 5
టెస్ట్ క్రికెట్‌లో కూడా ఐసీసీ పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు ఓవర్ రేట్‌ను సరిచేయడానికి టీ20 క్రికెట్‌లో స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయనున్నారు. ఓవర్ ముగిసిన తర్వాత.. కొత్త ఓవర్ ప్రారంభించడానికి ఒక నిమిషం సమయం ఇవ్వబడుతుంది. జట్టు రెండుసార్లు విఫలమైతే.. వారికి రెండు హెచ్చరికలు అందుతాయి. అలా జరగకపోతే.. సదరు జట్టుకు ఐదు పరుగులు జరిమానా విధిస్తారు.

5 / 5
వన్డే క్రికెట్‌లో కూడా ఒక పెద్ద మార్పు జరిగింది. ఇప్పుడు ప్రతి ఇన్నింగ్స్‌లో మొదటి 35 ఓవర్లకు రెండు కొత్త బంతులతో మ్యాచ్ ఆడతారు. తదుపరి 15 ఓవర్లలో ఫీల్డ్ సైడ్ ఆ రెండు బంతుల్లో ఒకదానికి మాత్రమే ఎంచుకుంటుంది.