Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్లు బౌలింగ్ చేసిన పేలవమైన రికార్డ్ మూసా జోబార్టే పేరులో చేరింది. అది కూడా 24 బంతుల్లోనే 93 పరుగులు ఇవ్వడం గమనార్హం. అంటే, ఇక్కడ బౌలర్ కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడన్నమాట.
టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గాంబియా బౌలర్ ముసా జోబర్టే 4 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇంతకుముందు ఈ చెత్త రికార్డ్ శ్రీలంక బౌలర్ కసున్ రజిత పేరు మీద ఉండేది. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కసున్ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇప్పుడు జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో మూసా జోబర్టే 4 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్‌కు సగటున 23.25 పరుగులు ఇచ్చాడు. దీని ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్లు విసిరిన అనవసర రికార్డును సొంతం చేసుకున్నాడు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యంత ఖరీదైన ఓవర్లు వేసిన చెత్త రికార్డ్ ప్రసిద్ధ్ కృష్ణ పేరిట ఉంది. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్షిద్ 4 ఓవర్లలో 68 పరుగులిచ్చి ఈ పేలవమైన రికార్డు సృష్టించాడు.