
Tim Southee: ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ జానీ బెయిర్‌స్టోను పెవిలియన్‌కి పంపాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అవతరించాడు. ఇప్పటివరకు 111 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన సౌథీ మొత్తం 141 వికెట్లు తీశాడు.

నిజానికి ఈ మ్యాచ్ జరగకముందు.. టిమ్ సౌథీ, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హాసన్ 140 టీ20 వికెట్లతో సమంగా ఉండేవారు. అయితే బెయిర్‌స్టో వికెట్ తీయడం ద్వారా షకిబ్‌ని సౌథీ అధిగమించి అగ్రస్థానంలో ఒంటరిగా నిలిచాడు.

దీంతో షకిబ్ అల్ హాసన్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా మిగిలాడు. ఈ 140 వికెట్లను షకిబ్ 117 టీ20 మ్యాచ్‌ల్లో తీశాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా ఆఫ్గాన్ బౌలర్ రషిద్ ఖాన్ ఉన్నాడు. 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన రషిద్ ఇప్పటివరకు 130 వికెట్లను పడగొట్టాడు.

99 మ్యాచ్‌ల్లో 119 వికెట్లను తీసిన న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోధీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్ అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ్ ఉన్నాడు. మలింగ 84 టీ20 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు.

అలాగే షబాద్ ఖాన్( పాక్ 104), ముస్తఫిజుర్ రెహ్మన్ (బంగ్లాదేశ్ 103), మార్క్ అడైర్ (ఐర్లాండ్ 98), షషిద్ అఫ్రిదీ(పాక్ 98) వరుస స్థానాల్లో ఉంగా.. భారత్ నుంచి యుజ్వేంద్ర చాహల్ 10వ స్థానంలో ఉన్నాడు. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 టీ20 వికెట్లు పడగొట్టాడు.