ODI World Cup 2023: వరల్డ్ కప్‌‌ చరిత్రలో తోపు బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్టులో భారత ప్లేయర్లకు దక్కని చోటు..

|

Sep 26, 2023 | 10:19 PM

ODI World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి 13వ ఎడిషన్ ‘వన్డే వరల్డ్ కప్’ 2023 ప్రారంభం కానుంది. ఇక వరల్డ్ కప్ అంటే అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు రెచ్చిపోయి ఆడాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే రాణించగలరు. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన 12 ఎడిషన్ల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
1. గ్లెన్ మెక్‌గ్రాత్: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడ్ గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో 39 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ఆడిన మెక్‌గ్రాత్ మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు.

2 / 6
2. ముత్తయ్య మురళీధరణ్: రెండో స్థానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ ఉన్నాడు. మురళీ 39 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు.

3 / 6
3. లసిత్ మలింగ: లసిత్ మలింగ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 28 ఇన్నింగ్స్ ఆడిన మలింగ 56 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

4 / 6
4. వసీమ్ అక్రమ్: వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో పాక్ మాజీ వసీమ్ అక్రమ్ 4వ స్థానంలో ఉన్నాడు. అక్రమ్ 36 వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్ ఆడిన అక్రమ్ తన కెరీర్‌లో 55 వికెట్లు పడగొట్టాడు.

5 / 6
5. మిచెల్ స్టార్క్: ఇక టాప్ 5 లిస్టులో ఉన్న ఏకైక యాక్టీవ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్ తరఫున 18 ఇన్నింగ్స్ ఆడిన స్టార్క్ ఏకంగా 49 వికెట్లు పడగొట్టి 5వ స్థానంలో ఉన్నాడు.

6 / 6
కాగా, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో భారత్ నుంచి జహీర్ ఖాన్ (23 ఇన్నింగ్స్‌ల్లో 44), జవగళ్ శ్రీనాథ్ (33 ఇన్నింగ్స్‌ల్లో 44) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు.