IPL 2024: నాడు రూ. 9 కోట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు రూ. 40 లక్షలకే..

|

Dec 03, 2023 | 4:20 PM

IPL 2024 Auction: ఈసారి IPL వేలం కోసం మొత్తం 1,166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితా షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. 2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

1 / 5
ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్‌లు భారీగా తరలివచ్చారు. ఈ స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే, వీరందరి కన్నా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు షారుఖ్ ఖాన్.

2 / 5
అవును, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న షారుక్ ఖాన్ ఈ వేలంలో కనిపించనున్నాడు. అది కూడా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో కావడం గమనార్హం. అసలు ధరతో పోల్చి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

3 / 5
2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

4 / 5
2022 వేలంలో, షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లు ఆఫర్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది.

5 / 5
షారుఖ్ ఖాన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 9 కోట్లకు అమ్ముడైన ఆటగాడు ఈసారి కేవలం 40 లక్షల బేస్ ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. అలాగే, మళ్లీ కోట్ల ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు.