
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన స్టీవ్ స్మిత్ ఈసారి ఐపీఎల్ 2023లో విభిన్నమైన శైలిలో కనిపించబోతున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. కానీ, సరికొత్త అవతారంతో స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

స్టీవ్ స్మిత్ IPL 2023లో వ్యాఖ్యానించబోతున్నాడు. ఐపీఎల్‌లో 103 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆటగాడు ఇప్పుడు తన స్వరం వినిపించనున్నాడు. స్టీవ్ స్మిత్ ఎన్ని మ్యాచ్‌లకు వ్యాఖ్యానిస్తాడో ప్రస్తుతానికైతే స్పష్టంగా తెలియదు.

స్టీవ్ స్మిత్ చివరిసారిగా 2021లో ఐపీఎల్ ఆడాడు. గతేడాది ఈ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అదే సమయంలో, అతను IPL 2023 వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు.

స్టీవ్ స్మిత్ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ధోనీ లాంటి ఆటగాడు స్మిత్ కెప్టెన్సీలో ఆడాడు. స్మిత్ తన IPL కెరీర్‌లో 34.51 సగటుతో 2485 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలు కలిగి ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 128గా నిలిచింది.

స్టీవ్ స్మిత్ IPL 2023లో ఆడనప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో అతని దేశానికి చెందిన చాలా మంది కీలక ఆటగాళ్లు కనిపించనున్నారు. డేవిడ్ వార్నర్ ఢిల్లీకి కెప్టెన్‌గా కనిపించనున్నాడు. కెమరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్ల స్టామినా కనిపిస్తుంది.