టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిల పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది. సోమవారం (జనవరి 23)న ముంబై ఖండాలా లోని ఫామ్‌హౌస్ జహాన్ లో వీరిద్దరు ఒక్కటి కానున్నారు.
జనవరి 21 నుంచి వీరి ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం పెళ్లి తంతు జరగనుంది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు సినిమా తారలు, క్రికెటర్లు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
పెళ్లిలో అతిథులకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఏర్పాటు చేసి సంప్రదాయం ప్రకారం అరటి ఆకుల్లో భోజనం పెట్టనున్నారట. అయితే పెళ్లి వేడుకలో ‘నో ఫోన్ పాలసీ’ ని అమలు చేయనున్నారట. పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బయటకు రాకుండా ఉండేందుకు గానూ సునీల్ శెట్టి.. పెళ్లికి హాజరయ్యే అతిధులను ఫోన్స్ తీసుకు రావద్దని కోరాడట.
కాగా పెళ్లి తర్వాత ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఉంటుందట. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో సహా సుమారు 3 వేలమందికి ఈ రిసెప్షన్‌ను ఆహ్వానించారట.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ 2018 నుంచి ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోనున్నారు లవ్ బర్డ్స్.