
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు.

ఈ కొత్త ట్రోఫీని గురువారం జూన్ 19, 2025న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సచిన్, ఆండర్సన్ ఇద్దరూ కలిసి ఆవిష్కరించారు

ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే, ఆండర్సన్ బౌలింగ్ యాక్షన్, అండర్సన్ వేసిన బంతిని సచిన్ డ్రైవ్ చేస్తున్న చిత్రం దానిపై చెక్కబడి ఉన్నాయి

ఈ కొత్త ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ ట్రోఫీలో సచిన్, ఆండర్సన్ సంతకం కూడా ఉంది. ఈ ట్రోఫీపై భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తామని రాసి ఉంది.

గతంలో ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్‌లో 'పటౌడీ ట్రోఫీ'గా, భారత్‌లో 'ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ'గా పిలిచేవారు. ఈ టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన వారికి ఈ ట్రోఫిని అందించేవారు. కానీ ఇప్పుడు గెలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ పతకం మాత్రయే ఇవ్వబడుతుంది.