Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసింది ఎవరంటే?

|

Jul 31, 2024 | 9:47 PM

టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి ఆరు వందల వికెట్ల క్లబ్ లో సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి స్పిన్నర్‌గా నిలిచాడు.

1 / 5

2 / 5
అలాగే టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 600 వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో పేరిట ఉండేది.

3 / 5
 వెస్టిండీస్, ఐపీఎల్, సీపీఎల్, బిగ్ బాష్ లీగ్, పీఎస్ఎల్ సహా పలు లీగ్‌లలో ఆడిన డ్వేన్ బ్రావో 545 టీ20 మ్యాచ్‌ల ద్వారా 600 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో రషీద్ ఖాన్ సక్సెస్ అయ్యాడు.

4 / 5
ఐపీఎల్, సీపీఎల్, బిగ్ బాష్, పీఎస్ఎల్ సహా ప్రపంచంలోని మేజర్ లీగ్‌లలో ఆడిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ కేవలం 441 టీ20 మ్యాచ్‌లలో 600 వికెట్లు సాధించాడు. దీంతో బ్రావో పేరిట ఉన్న ప్రపంచ రికార్డును చెరిపేశాడు.

5 / 5
ఇప్పుడు 543 ఇన్నింగ్స్‌లలో 630 వికెట్లు తీసిన డ్వేన్ బ్రేవో టీ20 వికెట్ లీడర్ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 438 ఇన్నింగ్స్‌లలో 600 వికెట్లు పూర్తి చేసిన రషీద్ ఖాన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాలంటే 31 వికెట్లు మాత్రమే కావాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రపంచ రికార్డు అఫ్గాన్ స్పిన్ మాంత్రికుడి ఖాతాలో చేరుతుందడంలో సందేహం లేదు.