
Asia Cup 2022: ఆసియా కప్ ఒక మిస్టరీ గర్ల్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనంగా మారింది. ఆమే వాజ్మా ఆయూబీ. ఆఫ్గాన్ క్రికెట్ జట్టు అభిమాని అయిన ఈ అందాల తార ఇండియాతో జరిగిన మ్యాచ్‌లోనూ సందడి చేసింది.

కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సుమారు 3 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతని సెంచరీతో పాటు వాజ్మా కూడా ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

ఆసియా కప్‌లో తన జట్టును ప్రోత్సహించిన వాజ్మా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి చేతిలో ఆఫ్గానిస్తాన్ జెండాతో స్టేడియంలో దర్శనమిచ్చింది.

28 ఏళ్ల వాజ్మా ఆఫ్ఘని. కానీ ఆమె దుబాయ్‌లో నివసిస్తోంది. వాజ్మా ఒక సామాజిక కార్యకర్త . ఆమె ఓ ఫ్యాషన్ లేబుల్‌ను నడుపుతోంది.

వాజ్మా ఓ క్రీడాభిమాని కూడా. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట.