
క్రికెట్ మైదానంలో అత్యద్భుతంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నేడు ఫైనల్ పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఉత్కంఠ ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. ఈ ట్రోఫీ గురించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ODI ప్రపంచకప్ 1975లో ప్రారంభమైనప్పటికీ, అధికారిక ట్రోఫీ 1999లో రూపొందించారు. అంటే 1975-1996 మధ్య జరిగిన 6 ప్రపంచకప్‌లలో విభిన్న డిజైన్ల ట్రోఫీలు అందించారు. 1999 ప్రపంచ కప్‌లో, ICC ప్రపంచ కప్ ట్రోఫీని రూపొందించింది. దీనిని అధికారికంగా ఐసీసీ ఆమోదించింది.

ప్రస్తుత క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని గెరార్డ్ అండ్ కంపెనీ ఆఫ్ లండన్ రూపొందించింది. దీని ప్రకారం గత 24 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీగా దీన్నే ఉపయోగిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎత్తు 65 సెం.మీ.లు. అలాగే మధ్య భాగంలో ప్రపంచాన్ని సూచించే, బంతిని సూచించే గోళాన్ని ఇవ్వడం విశేషం.

ప్రపంచ కప్ గెలిచినప్పుడు అసలు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఆ తర్వాత, విజేత జట్టుకు అదే మోడల్‌లో ప్రతిరూప ట్రోఫీని అందజేస్తారు. అలాగే అసలు ట్రోఫీ UAEలోని ICC ప్రధాన కార్యాలయానికి తిరిగి చేరుకుంటుంది.