Fruit Custard Salad: పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

Updated on: Sep 01, 2026 | 8:30 PM

పండుగలు, శుభకార్యాల విందులలో భోజనం తర్వాత చల్లచల్లగా, కమ్మగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది 'ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్'. పాలు, వెనిల్లా కస్టర్డ్ పౌడర్ మరియు తాజా రంగురంగుల పండ్ల ముక్కల కలయికతో తయారయ్యే ఈ డెజర్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలామందికి కస్టర్డ్ పాలు మరీ పల్చగా అవ్వడం లేదా చల్లారిన తర్వాత ఉండలు కట్టి గట్టిపడటం జరుగుతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్‌తో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: అర లీటర్ చిక్కటి పాలు, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వెనిల్లా కస్టర్డ్ పౌడర్,  తీపికి సరిపడా పంచదార, అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, నల్ల & ఆకుపచ్చ ద్రాక్షలు, పచ్చి మామిడి/సపోటా లేదా నచ్చిన సీజనల్ పండ్ల ముక్కలు.. పుల్లని పండ్లు మినహా, జీడిపప్పు, బాదం పలుకులు.

2 / 5
కస్టర్డ్ మిల్క్ తయారీ విధానం: ముందుగా అర లీటర్ పాలలో నుంచి అర కప్పు చల్లని పాలను ఒక గిన్నెలోకి విడిగా తీసుకోవాలి. మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై మరిగించాలి. విడిగా తీసిన అర కప్పు చల్లని పాలలో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వెనిల్లా కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు ఏమీ లేకుండా స్పూన్‌తో బాగా కలపాలి. 

3 / 5
పాలు ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, సిద్ధం చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పోస్తూ గరిటెతో కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. ఆ వెంటనే రుచికి సరిపడా 4-5 చెంచాల పంచదార వేసి కలపాలి.

4 / 5
చిన్న మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు కస్టర్డ్ పాలు కాస్త చిక్కబడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కస్టర్డ్ మిల్క్ పూర్తిగా చల్లారే వరకు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఆ తర్వాత కనీసం 1 నుండి 2 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబరచాలి.

5 / 5
ఫ్రిజ్ నుండి తీసిన చల్లని క్రీమీ కస్టర్డ్ పాలలో కట్ చేసి పెట్టుకున్న తాజా ఆపిల్, అరటిపండు, ద్రాక్ష, దానిమ్మ గింజలు మరియు డ్రైఫ్రూట్స్ వేసి నెమ్మదిగా కలపాలి. ఇక్కడ మీరు గుర్తుచుకోవాల్సిన ఏంటంటే-పండ్లను ముందే వేసి ఫ్రిజ్‌లో పెడితే పండ్లలోని నీరు ఊరి కస్టర్డ్ పల్చబడుతుంది, కాబట్టి సర్వ్ చేసే ముందే కలపడం మంచిది. అంతే, ఎంతో రుచికరమైన చిక్కటి క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ సిద్ధం! చల్లచల్లగా గ్లాసుల్లో లేదా బౌల్స్‌లో సర్వ్ చేసుకుని ఆస్వాదిస్తే అమృతంలా ఉంటుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us