
ప్రస్తుత ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కండరాల నొప్పులు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మలబద్ధకం, అలసట వంటివి సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో, మందులు వాడేవారిలో నరాల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఈ సమస్యలన్నింటికీ ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ముందుగా, అర టీస్పూన్ ధనియాలను తీసుకుని పొడిగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. అదేవిధంగా, అర టీస్పూన్ జీలకర్రను కూడా పొడిగా వేయించి అదే గిన్నెలో కలపాలి.చివరగా, అర టీస్పూన్ వామును కూడా పొడిగా వేయించి ఈ మిశ్రమంలో కలపాలి. ఈ మూడు దినుసులు ఉన్న గిన్నెలో ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి మూతపెట్టి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన ఈ నీటిని ఒక గిన్నెలోకి మార్చి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వడకట్టుకుని, పరగడుపున టీ తాగినట్లుగా గోరువెచ్చగా తాగాలి.

ఈ డ్రింక్ ప్రతిరోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నరాల బలహీనత నుండి అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. నడవలేనివారు సైతం చక్కగా నడవగలుగుతారు.జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారి, ముఖంపై గ్లో పెరుగుతుంది.

ధనియాలు: విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి, ఉదర సమస్యలను తగ్గిస్తాయి, ఆర్థరైటిస్, శరీర నొప్పుల నుండి విముక్తినిస్తాయి. ఎముకలకు బలాన్ని చేకూర్చి, కిడ్నీలు, చర్మం, జుట్టు సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతాయి.

జీలకర్ర: యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది, తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. కిడ్నీలు, మూత్రాశయంలోని రాళ్ళను కరిగించగలదు. కంటి సమస్యలకు మంచిది, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వాము: హై బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పికి ఉపశమనం ఇస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. కాల్షియం, పొటాషియం, ఐరన్ కలిగి ఉండి గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువును, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది.