
నవారా బియ్యం పిండి, రాగి జావకు జావ కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు నవార బియ్యం పిండి, రెండు నుంచి మూడు గ్లాసులు నీళ్ళు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చి మిర్చి, అర కట్ట కొత్తిమీర, నాలుగు కరివేపాకు , జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

ముందుగా రాగులు, బియ్యం పిండిని ఇలా చేసుకోవాలి: ముందుగా రాగులు, నవర బియ్యాన్ని తీసుకుని దానిని పిండిలాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే, వీటిని కూలింగ్ వాటర్ తో ఉండలు లేకుండా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఎందుకంటే, ఇది ఉరికే గట్టి పడుతుంది.

గ్యాస్ వెలిగించి ఈ విధంగా చేసుకోవాలి: ముందుగా మీరు ముందుగా గ్యాస్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టి దానిలో రెండు నుంచి మూడు కప్పుల నీళ్ళు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు కూడా వేయాలి. కొద్దీ సేపు అలా ఉంచి రుచి చూసి సరిపోకపోతే మళ్లీ దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలా అని ఎక్కువగా వేసుకోకండి.

నీరు మరిగిన తర్వాత పిండిని ఇలా కలుపుకోవాలి: నీరు మరిగిన తర్వాత మీడియం మంట పై దానిని కలుపుతూ అలాగే పిండిని కూడా కొద్దీ కొద్దిగా పోస్తూ ఇంకో చేతితో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేయడం వలన మెత్తగా అవుతుంది. ఈ కాంబోలో ఒకసారి తాగితే మళ్లీ మళ్ళీ చేసుకుని మరి తాగుతారు.

ఇప్పుడుమీడియం మంటపై 20 నిమిషాల పాటు దానిని బాగా ఉడికించాలి. ఇంకా గరిటేతో దానిని కలుపుతూ ఉండాలి. అంతేకాదు, పిండి ఉడికితే గట్టిగా మారుతుంది. ఇంకా గట్టిగా అవ్వాలంటే కొద్దీ సేపు బాగా ఉడికించి స్పూన్‌తో దానిని కలుపుతూ ఉండాలి. చివర్లో నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.