
నీటి ట్యాంకుకు సూర్య రశ్మి తగలకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన నీరు వెడెక్కవు. అదే విధంగా, ట్యాంకుపై షెడ్ ఏర్పాటు చేయాలి. దీని వలన నీటికి కాస్త నీడ తగిలి, అవి వేడిగా కాకుండా చల్లగా ఉంటాయి.

అలాగే చాలా మంది నీటి ట్యాంకులు ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి. అయితే ఇలా నలుపు రంగులో ఉండటం వలన ఎండకు సూర్య రశ్మిని ఎక్కవగా గ్రహించి నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే నలుపు రంగు వాటర్ ట్యాంకుకు తెలుపు రంగు వేయడం వలన నీరు త్వరగా వేడెక్కదు. అలాగే చల్లగా ఉంటాయి.

మీ వాటర్ ట్యాంకు చుట్టూ ఇసుకను పోయండి. దీని వలన కూడా నీరు చల్లగా ఉంటాయి. అంతే కాకుండా చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు పెట్టడం వలన కూడా నీరు త్వరగా వేడెక్కకుండా సహజంగా తెల్లగా ఉంటాయి.

అంతే కాకుండా వాటర్ ట్యాంకుకు జనపనారతో తయారు చేసిన తడి క్లాత్ చుట్టడం చాలా మంచిది. దీని వలన వాటర్ చాలా చల్లగా ఫ్రిజ్‌లో ఉన్నట్లు ఉంటాయి. అంతే కాకుండా వాటర్ ట్యాంక్ కూడా త్వరగా పాడవకుండా ఉంటుంది.

అంతే కాకుండా వాటర్ ట్యాంకులోని నీరు చాలా త్వరగా వేడెక్కకుండా ఉండాలి అంటే, మీ ట్యాంక్‌కు ఇన్సులేషన్ షీట్ లేదా ఫోమ్ కవర్‌ను అమర్చడం కూడా చాలా మంచిది. దీని వలన నీరు చల్లగా ఉంటుంది.