
మన సౌతిండియాలో ఎక్కవగా భోజనంలోకి రైస్‌ను మాత్రమే వాడుతారు. రోజులో మూడు పూటలా అన్నమే తింటారు. చాలా మందికి అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే చాలా మంది వేడి వేడి అన్నం తినడానికి ఇష్టపడుతారు. అప్పుడే వండిన వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి ఆమోగమంతే. కానీ ఆరోగ్య దృష్ట్యా చూస్తే, వేడి అన్నం కంటే చల్ల అన్నమే మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చల్లటి అన్నం వల్ల కలిగే ప్రయోజనాలు: వండిన అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రంతా అలాగే పెట్టి మరుసటి రోజు చద్దన్నంలా తిన్నప్పుడు అందులో పోషక విలువలు పెరుగుతాయి. వేడి అన్నంతో పోలిస్తే, వండి చల్లార్చిన అన్నంలో స్టార్ట్స్ అనేది రెసిస్టెంట్ స్టార్ట్స్‌గా మారుతుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

చద్దన్నాన్ని మజ్జిగ లేదా ఉల్లిపాయతో కలిపి తింటే బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వేడి అన్నంతో పోలిస్తే చద్దన్నం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ క్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్న ఉన్నవారికి లేదా బరువు తగ్గాలనుకునే ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి.

అదే మనం వేడి అన్నంలో చూసుకుంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి లేదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి వేడి, వేడి అన్నం కంటే చద్దన్నమే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే అన్నాన్ని రాత్రంతా ననబెట్టి ఉందయం తింటే అందులో ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అన్నాన్ని పులియబెట్టినప్పుడు అందులో ఉండే పోషకాలు మన బాడీ ఈజీగా గ్రహించేలా మారుతాయి. దీన్ని తినడం వల్ల అలసట తగ్గి తక్షణ శక్తి లభిస్తోంది.