
Sవేసవి కాలంలో ఉక్కపోత నుంచి బయటపడటానికి పాములు ఎక్కువగా ఇళ్లలో తిరుగుతుంటాయి. ఇవి ఇంటిలోకి ప్రవేశించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చాలా మంది వేసవిలో ఆరుబయట నిద్రిస్తారు. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది పాములను తరిమి కొట్టడానికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇళ్లకు పాములను దూరంగా ఉంచాలి అంటే కొబ్బరికాయ చిట్కాలు పాటించాల్సిందేనంట.

చాలా ప్రదేశాల్లో పాములను తరిమికొట్టడానికి ఎక్కువగా కొబ్బరికాయలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ చిట్కా ఎక్కువగా ఉపయోగిస్తారు. పాముకి ఎదురుగా కొబ్బరికాయ పెట్టడం వలన అది వెనక్కే వెళ్లిపోతుంది అంటారు. ఇది చాలా మంది నమ్మకం.

అయితే ప్రస్తుతం పాములను తరిమికొట్టే కొబ్బరికాయల ట్రిక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. పాము కనిపించినప్పుడు దానికి ఎదురుగా రెండు కొబ్బరి కాయలు పెట్టడం వలన అవి తమ దిశను మార్చుకోని వెళ్లడం లేదా పాము అక్కడే ఆగిపోవడం చేస్తుందంట. చాలా వరకు ఈ ట్రిక్ సర్పశాస్త్ర వేత్తలు మాత్రమే ఉపయోగిస్తారంట. దీని ద్వారా వారు పాములను పట్టుకొని, బయట వదిలేస్తారు.

అయితే అందరూ ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చునా అంటే, కొబ్బరికాయ ముందు ఉంచితే అన్ని సార్లు పాములు బయటకు వస్తాయి అని చెప్పలేం. కొబ్బరికాయలకు తరిమి కొట్టే శక్తికానీ, మాయా శక్తి కానీ ఉండదు, అవి కంపనాలకు మాత్రమే స్పందిస్తాయి, లేదా కొబ్బరి కాయలను చూస్తే అవి భయపడతాయని, వాటి నుంచి పాములు బయటకు రావు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు అని వారు తెలియజేస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.